Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్-హెబ్బా పటేల్ నటించిన గీత వ‌స్తోంది

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (17:19 IST)
Hebba Patel
వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు "విశ్వ"ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... వి.వి.వినాయక్ ఆశీస్సులతో "గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". "మ్యూట్ విట్నెస్" అన్నది ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.
 
 క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు.
దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... "ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
 
రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments