Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌ చెప్పే శ్రీ‌రంగ‌నీతులు ఏమిటి!

డీవీ
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (16:05 IST)
Suhas, Karthik Ratnam, Ruhani Sharma, Viraj Ashwin
సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌  ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం నుంచి విన‌రా విన‌రా చెబుతా విన‌రా ఈ కాలం శ్రీ‌రంగ‌నీతులు అంటూ కొన‌సాగే సినిమా టైటిల్ సాంగ్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌కు అజ‌య్ అర‌సాడ సంగీతాన్ని అందించారు. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఈత‌రం యువ‌త వారి ఆలోచ‌న‌ల‌ను, వారి ఎమోష‌న్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే  పాత్రల ద్వారా చూపిస్తున్నాం. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే  ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌ను ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువ‌త ఆలోచ‌న‌లు, కుటుంబ బంధాలు..ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల క‌ల‌యిక‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని అంద‌ర్ని అల‌రించే విధంగా తెర‌కెక్కించాడు.   త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం  అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే లేవు... తప్పుకుంటున్నాం : పేర్ని నాని

డొనాల్డ్ ట్రంప్ పేరిట కొత్త వైన్‌ను పరిచయం చేసిన ఇజ్రాయేల్

ఏపీలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకం..

రణరంగంగా జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ... ఎమ్మెల్యేల బాహాబాహీ (Video)

శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments