Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుల్వామా అమరవీరులకు నివాళులర్పించిన వరుణ్ తేజ్, ఆపరేషన్ వాలెంటైన్ టీం

Advertiesment
Varun Tej,  Manushi Chillar

డీవీ

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (18:02 IST)
Varun Tej, Manushi Chillar
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్ర బృందం పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించింది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్ర దాడిలో40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు వరుణ్ తేజ్, చిత్ర బృందం ఘనంగా నివాళులర్పించారు.
 
webdunia
Varuntej and army jawanas
ఆపరేషన్ వాలెంటైన్ భారతదేశం వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాల స్ఫూర్తితో నిజమైన సంఘటనల ప్రేరణతో రూపొందించారు. ఇది దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. మన వైమానిక దళ వీరుల అసమానమైన స్ఫూర్తిని, పోరాటాన్ని, భయంకరమైన వైమానిక దాడులలో ఎదుర్కొన్న సవాళ్లను అద్భుతంగా చుపించనున్నారు.
 
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం, గగనాల చార్ట్ బస్టర్ సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో వరుణ్ తేజ్ బాలీవుడ్ డెబ్యు చేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది. రుహానీ శర్మ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఆపరేషన్ వాలెంటైన్’ కు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు.
 
ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రేమ కథగా శశివదనే విడుదలకు సిద్ధం