శుభలేఖ సుధాకర్ ఈ పేరు తెలియని తమిళ, తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. ఆయన ఎంతో సౌమ్యునిగా అందరికి పరిచయం. అలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మీడియా అని చెప్పుకునే కొంతమంది వల్ల వారు పెట్టే థంభ్‌నెయిల్స్ వల్ల ఎంత ఇబ్బంది పడింది చెప్తూ చాలా ఆవేశపడ్డారు.
వాళ్లమ్మగారు చనిపోయే ముందురోజు రోజులానే డిన్నర్ అవ్వగానే టాబ్లెట్ప్ ఇచ్చి పడుకోమ్మా అని చెప్పి వస్తుంటే, సుధాకర్ అని పిలిచారట. ఏంటమ్మా అంటే శైలు నువ్వు బాగానే ఉన్నారా అని అడిగారట. అదేంటి అలా అడుగుతున్నావు కొత్తగా, అని నవ్వేసి, పడుకోమ్మా అని వచ్చారట. అప్పుడు, ఆరోజు ఓ యట్యూబ్ చానల్ వాళ్లు పెట్టిన థంబ్‌నెయిల్ సుధాకర్– శైలజ విడపోయారని. ఆలా పడుకున్న వాళ్లమ్మగారు అలానే కన్నుమూశారట.
మరో యూట్యూబ్ చానల్ వారు ఏకంగా శుభలేఖ సుధాకర్ చనిపోయాడు అని హెడ్డింగ్ పెట్టారట. డబ్బులు తీసుకుని వ్యభిచారం చేసే వేశ్య కంటే అలాంటి హెడ్డింగులు పెట్టి బతికే మీడియావారే దారుణం అన్నారు. ఇటీవలే విడుదలైన యాత్ర–2 సినిమాలో ఎంతో ఎమోషనల్ కంటెంట్‌లో నటించిన ఆయన ఓ ఇంటర్వూలో చెప్పిన మాటలు మనస్సుకు చివుక్కుమనిపిస్తాయి. ఇలా ఎందరో నటీనటుల జీవితాలతో కొందరు యూట్యూబర్ల్స్ ఆడుకోవడం శోచనీయం.