Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేడీస్ టైలర్ కాంబినేషన్ 37 ఏళ్ళ తర్వాత రిపీట్

Advertiesment
Rajendra Prasad, Archana, Rupesh Kumar Chaudhary, Akanksha Singh
, శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:49 IST)
Rajendra Prasad, Archana, Rupesh Kumar Chaudhary, Akanksha Singh
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన... ఈ జోడీ పేర్లు వింటే 'లేడీస్ టైలర్' గుర్తుకు వస్తుంది.  'సుజాతా....మై మర్ జాతా' డైలాగును, ఆ సన్నివేశాన్ని, ఆ సినిమాను అంత త్వరగా ఎవరు మర్చిపోతారు? చెప్పండి! తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదొకటి. ఆ సినిమా వచ్చిన 37 ఏళ్లకు మళ్లీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఓ కొత్త సినిమాలో సూపర్ హిట్ జోడీ నటిస్తోంది.
 
రాజేంద్ర ప్రసాద్, అర్చన  ప్రధాన పాత్రల్లో MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'షష్టిపూర్తి'. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ కుమార్ చౌదరి నిర్మాత. చెన్నైలోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో  ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఇసైజ్ఞాని సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా... సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి క్లాప్ ఇచ్చారు.
 
సినిమా హీరో, నిర్మాత రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ ''రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా వంటి లెజెండ్స్‌తో సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. 'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన గారు చేస్తున్న చిత్రమిది. 'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్‌లో 'ఆస్తులు అంతస్థులు', 'చెట్టు కింద ప్లీడర్', 'ఏప్రిల్ 1 విడుదల' వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంబినేషన్ కూడా రిపీట్ అవుతోంది. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇదొక న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. 
 
రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్, 'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, వై. విజయ, 'శుభలేఖ' సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియం, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను,  ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, కొరియోగ్రఫీ: బృందా, లిరిక్స్ : చైతన్య ప్రసాద్, రెహమాన్,  డీఓపీ: రామిరెడ్డి, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్ : మా ఆయి ప్రొడక్షన్స్ LLP, నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి, దర్శకుడు: పవన్ ప్రభ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దర్శకుడు నేను ఆఫీస్ బాయ్ అని గుర్తు చేసాడు : మురుగదాస్