Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథే హీరో నేను కాదు యాంక‌ర్‌, హీరో ప్ర‌దీప్‌

ఆర్ట్ ద‌ర్శ‌కుడు న‌రేష్ కుటుంబాన్ని ఆదుకుంటాః నిర్మాత యస్వీ బాబు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (19:44 IST)
SV. Babu, Anoop rubens, Pradeep
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఫణి ప్రదీప్ (మున్నా)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ యస్వీ బాబు నిర్మించిన చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా". జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో.. దిగ్విజయంగా రన్ అవుతుంది. ఈ సందర్బంగా ఆడియెన్స్‌కి థాంక్స్ చెప్పడానికి థాంక్స్ మీట్ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు .
 
హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ..' ఇది మా అబ్బాయి సినిమా అని.. కుటుంబ సమేతంగా  థియేటర్స్‌కి తరలి వచ్చి మా సినిమాని చూస్తున్న ప్రతీ ప్రేక్షకులకు నా పాదాభివందనం. రిలీజైన నాటి నుండి నేటి వరకు 25 థియేటర్స్ సందర్శించాం. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి చాలా ఆనందం కలిగింది. సినిమా చాలా చాలా బాగుంది అని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మేము ఊహించనంత హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు.

యస్వీ బాబు గారు సొంతకొడుకు సినిమాకి కేర్ తీసుకున్నంతగా నన్ను చూసుకొని హీరోగా మంచి సినిమా ద్వారా లాంచ్ చేశారు.. ఆయనకి ఎప్పుడూ ఋణపడి ఉంటాను. అలాగే నాకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన మున్నాకి చాలా థాంక్స్.. ఒక అన్నలా భావించి నాతో ఈ సినిమా చేశాడు మున్నా. ఈ సినిమాకి నేను హీరో కాదు.. కథే హీరో. మెయిన్ లీడ్ పాత్ర చేసానంతే..అది నచ్చబట్టే సినిమాని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. మా అందరికీ ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అలాగే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే పాటలు ఇచ్చిన మా అనూప్‌కి థాంక్స్.

నా మొదటి సినిమా జర్నీలో టీం అందరూ చాలా కష్టపడి చేశారు. ఒక సక్సెస్‌ఫుల్ సినిమా ఇచ్చారు నాకు. ముఖ్యంగా మా ఆర్ట్ డైరెక్టర్ నరేష్ షూటింగ్ టైంలో అనుకోకుండా మా అందరికీ దూరమయ్యారు. ఆయన లేనిలోటు మాకు చాలా వెలితిగా ఉంది. నా క్యారెక్టర్‌ని స్కెచెస్ వేసి అద్భుతంగా డిజైన్ చేశారు. ఆయన కుటుంబానికి మేమంతా జీవితాంతం తోడు వుంటామని ప్రామిస్ చేస్తున్నాం. ఇక నేను చేసే ప్రతీ సినిమా మొదటి సినిమాలా భావించి కష్టపడి చేస్తానని మాట ఇస్తున్నాను.. అన్నారు.
 
నిర్మాత యస్వీ బాబు మాట్లాడుతూ.. ' మా సినిమాని జిఎటు, యూవీ సంస్థలు గ్రాండ్‌గా ఆడియెన్స్ అందరికి రీచ్ అయ్యేలా రిలేజ్ చేశారు. వారికి నా కృతజ్ఞతలు. లాస్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ కావాల్సిన మా సినిమా వన్ ఇయర్ లేట్ అయినా కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడ్వాన్సులు ఇచ్చి.. ఇప్పటిదాకా నాకోసం వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్లంతా చాలా హ్యాపీగా వున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవడానికి మెయిన్ కారణం అనూప్.

మా సంస్థకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. కథ, కథనం చాలా ఇంట్రెస్టింగా చేసి ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేసిన మా డైరెక్టర్ మున్నాకి చాలా థాంక్స్. మా సినిమాకి ఇవాళ ఇంత ఓపెనింగ్స్ రావడానికి కారణం ప్రదీప్. ప్రతిఇంట్లో ఒక మనిషిగా ఉన్న ప్రదీప్ కోసం జనాలు వచ్చి సినిమా చూస్తున్నారు. ప్రతీ ఏరియాల్లో రెస్పాన్స్ చాలా బాగుంది. థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఇంతలా మా చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ నా అభివందనాలు.. మా ఆర్ట్ డైరెక్టర్ అకాల మరణం చెందారు. వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి నా వంతు సహాయసహకారాలు అందిస్తాను.. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాకి డే వన్ నుండి సపోర్ట్ చేస్తున్న ప్రతిఒక్కరికీ చాలా చాలా థాంక్స్. మా నిర్మాత బాబు గారు లేకపోతే అసలు ఈ సినిమా లేదు. ఈ టు ఇయర్స్ జర్నీలో ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను.. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్ గా వుంటారు. ఆయన మంచితనం కోసమే ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించింది. మున్నా అన్నీ ఎమోషన్స్ బాగా డీల్ చేశాడు. అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మున్నా ని అప్రిషియేట్ చేస్తున్నాను. తను గ్యారెంటీగా పెద్ద దర్శకుల జాబితాలోకి వెళ్తాడు. ప్రదీప్ తన అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడు. హీరో కావాలనుకున్న తన కలని ఈ సినిమాతో నెరవేర్చుకున్నాడు. ఆడియోతో పాటు సినిమాని కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లందరికి మా టీం తరుపున ధన్యవాదాలు.. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments