Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్‌కు పొగరు తలకెక్కిందా?

విజయ్ దేవరకొండ నటించిన ''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరో, చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్న

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (10:52 IST)
విజయ్ దేవరకొండ నటించిన ''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరో, చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్నాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ చెన్నైలోని ఓ రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. మద్యం తాగి కారు నడిపినట్లు తెలుస్తోంది. 
 
అంతే.. మితిమీరిన వేగంతో కారును అదుపు చేయలేక ఓ ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ధ్రువ్ నడిపిన కారును స్వాధీనం చేసుకున్న పాండీ బజార్ పోలీసులు, ధ్రువ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నామని తెలిపారు. 
 
ఇప్పటికే ప్రముఖ దర్శకుడు బాల డైరక్షన్‌లో ధ్రువ్ ఓ సినిమా చేస్తున్నాడు. అంతేగాకుండా తెలుగులో హిట్టైన అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇంతలో పొగరు తలకెక్కిందో ఏమో కానీ స్నేహితులతో కలిసి కారులో వెళ్లిన ధ్రువ్.. తేనాంపేటలోని అతని ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఆటోను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన ఆటో డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments