Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2ను బీట్ చేసిన విశ్వరూపం-2.. తొలిరోజే వెనక్కి నెట్టేసిందా?

''లోకనాయకుడు'' కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం విశ్వరూపం-2 భారీ అంచనాల మధ్య ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ తమిళ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్.. తన స్వీయ దర్శకత్వంలో ఈ స

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (10:35 IST)
''లోకనాయకుడు'' కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం విశ్వరూపం-2 భారీ అంచనాల మధ్య ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ తమిళ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్.. తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు చెన్నైలో దుమ్మురేపాయి. టాక్‌తో సంబంధం లేకుండా బాహుబలి 2 రికార్డును కమల్ సినిమా బద్దలు కొట్టింది. 
 
బాహుబలి 2 చెన్నైలో మొదటి రోజు రూ.92లక్షల వసూళ్లు రాబట్టగా... విశ్వరూపం-2 మొదటి రోజు రూ.93లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. చెన్నైలో ఫస్ట్ డే కలెక్షన్లలో ఈ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. 
 
కాలా, వివేగం, కబాలి, తెరి లాంటి సినిమాల తర్వాత విశ్వరూపం-2 ఉంది. విశ్వరూపం సిరీస్‌కు మొదటి నుంచి అవాంతరాలు ఎదురవుతూనే వున్న సంగతి తెలిసిందే. అయితే వాటినన్నంటినీ కూడా ఎదుర్కొని విశ్వరూపం తొలి పార్ట్ ఘన విజయం సాధించింది. రెండో పార్ట్ కూడా అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments