Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టిబాబు మరింత దగ్గరయ్యాడు.. జగపతి బాబు పాత్ర సూపర్ : రాజమౌళి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమం ఆదివారం వైజాగ్

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (14:13 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమం ఆదివారం వైజాగ్ వేదికగా జరిగింది. ఇందులో ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
ఈ ట్రైలర్‌ను వీక్షించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన స్పందనను తెలియజేశారు. 'చిట్టిబాబు తనకు మరింత దగ్గరయ్యాడు' అని ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. ట్రైలర్ చూసిన తర్వాత చరణ్‌పై తనకున్నఆప్యాయత చాలా పెరిగిందన్నారు. 
 
ముఖ్యంగా, జగపతి బాబు పాత్ర చాలా బాగుందని, తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఈ సినిమా రిలీజ్ కోసం తను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఆదివారం రాత్రి 11.21 నిమిషాలకు ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు తెగ లైక్స్ కొడుతూ షేర్లు చేస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన "మగధీర" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments