Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ గురించి చెబితే మీకేంటి ఉపయోగం.. విద్యార్థులతో దర్శకుడు రాజమౌళి (వీడియో)

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చాలా రోజుల తరువాత విద్యార్థుల మధ్యకు వచ్చారు. విద్యార్థులు ఏవిధంగా ఉండాలి.. ఎలా ముందుకెళ్ళాలని సలహాలు, సూచనలు ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు విద

ప్రభాస్ గురించి చెబితే మీకేంటి ఉపయోగం.. విద్యార్థులతో దర్శకుడు రాజమౌళి (వీడియో)
, శనివారం, 10 మార్చి 2018 (18:40 IST)
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చాలా రోజుల తరువాత విద్యార్థుల మధ్యకు వచ్చారు. విద్యార్థులు ఏవిధంగా ఉండాలి.. ఎలా ముందుకెళ్ళాలని సలహాలు, సూచనలు ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని సిద్ధార్థ కళాశాల ఇందుకు వేదికైంది.
 
బాహుబలి-1, బాహుబలి-2 భారీ విజయాల తరువాత రాజమౌళి రేంజ్ పూర్తిగా మారిపోయింది. దర్శకుల్లోనే కొత్త ట్రెండ్ సృష్టించిన రాజమౌళి అంటే తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అన్ని పరిశ్రమల్లోని దర్శకులకు గౌరవమే. ఎప్పుడూ ఎలాంటి హుంగూ ఆర్భాటాలకు తావివ్వని రాజమౌళి విద్యార్థుల మధ్యకు వచ్చారు. 
 
పట్టుదల, కృషి, ఆత్మస్థైర్యం, నిరంతర పోరాట పటిమ ఉంటే జీవితంలో విజయం సాధించవచ్చునన్న స్ఫూర్తిని విద్యార్థుల్లో కలిగించారు రాజమౌళి. చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగితే విద్యార్థులు సాధించలేనిది ఏదీ ఉండబోదన్నారాయన. బాహుబలి అనేది సినిమాలోని ఒక క్యారెక్టరే.. ప్రతి ఒక్కరు తాము అనుకున్నది జీవితంలో సాధిస్తే వారందరూ కూడా నిజమైన బాహుబలి అవుతారని చెప్పారు. చూడండి వీడియోను ఆయన మాటల్లోనే...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్వానీని పట్టించుకోని మోదీ.. నమస్కారం పెట్టినా సంస్కారం లేకుండా?