Webdunia - Bharat's app for daily news and videos

Install App

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

దేవీ
శుక్రవారం, 16 మే 2025 (19:06 IST)
Srivishnu speech
శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ ప్రధాన తారాగణంగా రిలీజ్ అయిన చిత్రం  '#సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.  గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే9న విడుదలై సక్సెస్ గా సాగుతోంది. ప్రమోషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల యాత్రలు చేసింది చిత్ర యూనిట్.
 
ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ, సింగిల్ కథ కార్తీక్ రాజా గారు మూడేళ్ళ నాడు కలిసి చెప్పారు. అంతకుముందు 10మంది రిజెక్ట్ చేశారు. వారికీ థ్యాంక్స్.. వారు చేయకపోవడం వల్లనేమో చాలా కసిగా చేశాం. నా కసిలో వెన్నెల కిశోర్ భాగమయ్యారు. మొదటినుంచి గీతా ఆర్డ్స్ లో ఓకే అని చెప్పాక, రిజల్ట్ గురించి ఆలోచించను. కానీ ఈ సినిమాతో అనుకున్నాను. మంచి టీమ్ తో జర్నీ చేస్తున్నాం. ఎలాగైనా సక్సెస్ వస్తే రిలేషన్ బాగుండాలని అనుకునేవాడిని. అది జరిగింది. దేవుడున్నాడు. నిజాయితీ చేస్తే దేవుడు విజయం ఇస్తాడు. అరవింద్ గారికి థ్యాంక్స్. ఇలాంటి స్టోరీకి అరవింద్ గారు ముద్ర వేశారంటే ఆయన హార్ట్ యువకుడిలా వుంటుంది. చాలా ఓపెనింగ్ అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. నిర్మాత విద్యగారు. ఆమె కోసమన్నా సక్సెస్ అవ్వాలను ఘాడంగా అనుకున్నా. 
 
కిశోర్, ప్రసన్న తో కలిసి చేసేటప్పుడు కొన్ని మెరుగులు దిద్దేవాళ్లం. అందుకు దర్శకుడు చాలా సహకరించారు. సింగిల్ సినిమా సింగిల్ థియేటర్లలో బాగా ఆడుతోంది. బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థియేటర్లలో ఇంకా రెండు వారాల్లో వుండవచ్చు. అల్లు అరవింద్ గారు మంచి ప్లానింగ్ వేశారు. ఇది టీవీలో వచ్చినా బాగా చూస్తారు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

ఆ నగల్లో వాటా ఇవ్వండి లేదంటే అమ్మ చితిపై నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments