Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Advertiesment
Sri Vishnu, Ketika Sharma, Ivana and others

దేవీ

, శుక్రవారం, 9 మే 2025 (12:43 IST)
Sri Vishnu, Ketika Sharma, Ivana and others
శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో రాజేంద్రప్రసాద్, నితిన్ నార్నే తదితరులు నటించిన సినిమా ఇది.
కార్తీక్ రాజు దర్శకుడు,అల్లు అరవింద్ సమర్పకుడు,  విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. మే 9న నేడే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ ఓ బ్యాంక్ లో ఉద్యోగులు. తనను ఎవరూ ప్రేమించడలేదని దేవుడికి విన్నవించుకుంటాడు. ఆ టైంలోనే కిశోర్ కు గాళ్ ఫ్రెండ్ వుందని తెలుస్తుంది. లవర్ ను పరిచయం చేసే క్రమంలో కిశోర్ గురించి  శ్రీవిష్ణు ఎక్కువ చెప్పడంతో బెడిసికొడుతుంది. ఆ తర్వాత  ఆఫీసుకు మెట్రో జర్నీలో వెళుతుండగా కనిపించిన కేతిక శర్మపై మనసు పారేసుకుంటాడు విష్ణు. ఆమెను ఫాలోఅయి కారు షోరూమ్ మేనేజర్ అయిన ఆమె దగ్గరకువెళ్లి కారు కొంటున్నట్లు బిల్డప్ ఇచ్చి కొద్దిరోజులు తన చుట్టూ తిప్పుకుంటాడు.

మరోవైపు ఇవానా అనే అమ్మాయి శ్రీవిష్ణును ప్రేమిస్తున్నానని వెంటపడుతుంది. చిన్న బుడతావున్నావ్. నీపై నాపై ఫీలింగ్ లేవని రిజెక్ట్ చేస్తాడు. అసలు కేతికశర్మ నిన్ను ప్రేమించడంలేదు. నిన్ను ఛీటింగ్ చేస్తుందని ఇవానా చెబుతుంది. ఆమె ఎందుకు అలా చీటింగ్ చేస్తుంది? అసలు ఇవానా ఎవరు? స్నేహితుడి ప్రేమకోసం వెన్నెల కిశోర్ ఏం చేశాడు? అన్నది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ కథ చాలా సింపుల్ గా వినోదం బేస్ పైనే నడుస్తుంది. చిన్నపాటి డైలాగ్ లు, సందర్భానుసారంగా సాగే మాటలతో సాగుతుంది. ఈ కథలో పేరుకు శ్రీవిష్ణు హీరోనే కానీ అసలు సినిమా మొత్తాన్ని మోసింది వెన్నెల కిశోర్. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమ విషయంలో ఆడుకునే సన్నివేశాలు ఎంటర్ టైన్ తెప్పిస్తాయి. సిల్లీ కథతో సిల్లీ సన్నివేశాలతో ఆద్యంతం సాగుతుంది. వీరి బాస్ గా గణేష్ పాత్ర చాలా సినిమాల్లో వుండేవిధంగా బకరా అయ్యేట్లు డిజైన్ చేశారు. రాజేంద్రప్రసాద్, నార్నే నితిన్ పాత్రలు గెస్ట్ గా కనిపిస్తారు. సంభాషణలపరంగా దర్శకుడు చాలా ఫ్రీడమ్ తీసుకున్నాడు. సన్నివేశపరంగా చిరంజీవి, బాలక్రిష్ణ తోపాటు కొందరివి ఇమిటేడ్ చేస్తూ ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్ లో మంచు విష్ణు గురించి పలికిన మంచుకురిసిన డైలాగ్.. కట్ చేశారు. 
 
శ్రీవిష్ణుతనపై తాను కొన్నిచోట్ల సెటైర్ వేసుకున్నాడు. ఇందులో ఎడమచేయి వాటం క్లియర్ గా చూపించాడు.  వెన్నెల కిశోర్ సాధారణంగా చేసే పాత్రనే పోషించాడు. ప్రభాస్ శీనుతో పాటు పలువురు రౌడీ గ్యాంగ్ గా సన్నివేశపరంగా వచ్చి వెళుతుంటారు. ఇద్దరు హీరోయిన్లు పర్వాలేదు. అందులో బుడత ఇవానా పాత్ర యూత్ ను ఆకట్టుకుంటుంది. ఇంటర్ వెల్ ట్విస్ట్ బాగుంది. అలాగే క్లయిమాక్స్ కూడా కొత్తగా అనిపించినా మళ్ళీ దానికి సీక్వెల్ గా ట్విస్ట్ ఇచ్చాడు. ఏది ఏమైనా  సినిమాటిక్ గా సన్నివేశానికి అనుగుణంగా దర్శకుడు మాటలు రాసేసుకున్నాడు.
 
దర్శకుడు మోటివ్ పూర్తిగా ప్రేక్షకుడిని నవ్వించడమే. అందుకు కొన్ని రూల్స్  కూడా అతిక్రమించాడనే చెప్పాలి. శేకర్ చంద్ర సంగీతం, నేపథ్యం బోర్ అయితే కొట్టదు. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ ఓకే. మిగిలిన సాంకేతిక సిబ్బంది పరిమితి మేరకు పనిచేసినట్లుగా అనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ చాలా సింపుల్ తీసిన సినిమా  ఇది. నిర్మాణపరంగా  పొందికగా అనిపిస్తుంది. అంతా హైదరాబాద్ లో మెట్రో, ఇందిరా పార్క్ వంటి కొన్ని ప్రాంతాలలో చుట్టేశారు. తీసేశారు. దర్శకుడు తమిళుడిఅయినా తెలుగులో కొన్ని సినిమాలకు పనిచేయడంతో ఆ ఛాయలు ఇందులో కనిపిస్తాయి.
 
శ్రీవిష్ణుకు ఇది మరో ఎంటర్ టైన్ సినిమాగా వుంది. ఈ సినిమా ఓటీటీలో బాగా ప్లే చేయనున్నదని చెప్పవచ్చు. సామజరవనగమన సినిమా తర్వాత ఇంచుమించు అలాంటి కథతో కాస్త మార్పు చేసి తీసినట్లుగా వుంది. ఏది ఏమైనా ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే సినిమాగా చెప్పవచ్చు. 
రేటింగ్: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్