Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

Advertiesment
Single hero heroien

దేవీ

, గురువారం, 8 మే 2025 (18:13 IST)
Single hero heroien
సామజవరగమన ఫేమ్ శ్రీవిష్ణు నటించిన సినిమా #సింగిల్‌ ఎలా వుండబోతోందని ఆసక్తి ఆయనకూ, ఆయన టీమ్ కూ నెలకొంది. చిత్ర టీమ్ మేరకు ఈ సినిమా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో వుండబోతోందని తెలుస్తోంది. సింగిల్ గా వుండే హీరోకు తోడు కావాలని ఎవరైనా ప్రేమిస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తుంటారు. కానీ ఎవరూ సెట్ కారు. పైగా తనతోటివారు సింగిల్ గా వుండేవారు డబుల్ గా అయ్యేసరికి ఎక్కడలేని ఆక్రోషం వస్తుంది. దానితో లేడీస్ అంటే అసహ్యించుకుంటాడు.
 
అలా సాగుతున్న ఆయన జర్నీలో షడెన్ గా ఓ అమ్మాయి నచ్చుతుందట. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రే చేస్తుంటాడు. ఆమె డిమాండ్స్ కూడా ఓకే అంటాడట. అలా ప్రేమ సాఫీగా సాగుతుండగా, మరో అమ్మాయి హీరో జీవితంలో ప్రవేశిస్తుంది. తను కూడా శ్రీవిష్ణును  ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏమయింది. ఒక్కరి ప్రేమకోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఇద్దరు వస్తే ఏం చేశాడు? వీరి ప్రేమకు మూలకారకుడు వెన్నెల కిశోర్. ఇద్దరి కాంబినేషన్ చాలా ఫన్ గా వుంటుందని తెలుస్తోంది.
 
ఈ కథ చెప్పినప్పుడు దర్శకుడు కార్తీక్  చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ సినిమాలో రెండు ట్విస్ట్ లు ఊహించనివిధంగా వుంటాయట. ఇంటర్ వెల్ సీన్ ను ఎవరూ ఊహించరట. అదేవిధంగా క్లయిమాక్స్ లోనూ ప్రేక్షకుల మైండ్ కు అందని ట్విస్ట్ వుంటుందని శ్రీవిష్ణు తెలియజేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌ రేపు శుక్రవారం విడుదలకాబోతుంది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్