ఇద్దరు హీరోలు. ఒకరు మంచు విష్ణు. మరొకరు శ్రీ విష్ణు. వీరిద్దరి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవే కన్నప్ప, 'సింగిల్'. ఇటీవలే సింగిల్ ట్రైలర్ విడులైంది. అందులోని సన్నివేశాలు వేరయినా రెండు డైలాగ్స్ లు కామన్ గా వుండడంతో నెటిజన్లు ఇద్దరినీ రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడం విశేషం. ఈ విషయాన్ని శ్రీ విష్ణు లైట్ గా తీసుకున్నా, మంచు విష్ణు మాత్రం కాస్త సీరియస్ గా వున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
శ్రీ విష్ణు తాజా చిత్రం 'సింగిల్' ట్రైలర్ హాస్యభరితంగా వుంది. శ్రీ విష్ణు, హాస్యనటుడు వెన్నెల కిషోర్‌తో కలిసి హాస్యంతోపాటు పంచ్ లైన్‌లను అందించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇక ట్రైలర్ లో తన ప్రేమ గురించి విఫలం అవుతుందనేమో అనే సన్నివేశపరంగా ఒకరిని కొడతానికి శివయ్యా అంటూ పరుగెడుతూ డైలాగ్ అంటాడు. సరిగ్గా ఇలానే కన్నప్పలో మంచు విష్ణు కూడా ఇలానే అన్నాడంటూ పోలుస్తూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
అదనంగా, సింగిల్ ట్రైలర్ చివరలో, శ్రీ విష్ణు "మంచు కురిసి పోతుందని..." అని చెప్పడం చాలా మంది నెటిజన్లు మంచు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది, వారి కుటుంబ వివాదాల మధ్య సింగిల్ మంచులను ట్రోల్ చేయడం గురించి చర్చలకు ఆజ్యం పోస్తోంది. మరి ఇద్దరూ సందర్భాన్ని బట్టి మీడియాకు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.