మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. మంచు ఏమన్నారంటే.. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న విషయం, నేను ఈ రోజు ఇలా ఉన్న విధానాన్ని తీర్చిదిద్దిన విషయం.రేపు మరియు ఉదయం 11 గంటలకు దీన్ని తెలియజేస్తానంటూ.. తెలిపారు. పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్లు తెగ రెచ్చిపోయారు.
అన్నా.. కన్నప్ప సినిమా రిలీజ్ కావడంలేదా? కనీసం ఓటీటీలో విడుదలచేయి. థియేటర్లలో చూడాలంటే డబ్బులు లేవు.. అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, మరికొందరు అసలు మీ కుటుంబంలో మరో పెద్ద విషయం ఏమైనావుందా? అంటూ కితకితలు పెడుతున్నారు. అసలు నువ్వు రేపు చెప్పడం ఏమిటి? నీ విషయాలు ఎవడికి కావాలంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఏదో రకంగా మంచు విష్ణుపై కామెంట్లు పెట్టి నెటిజన్లు ఫేమస్ అవుతుందో. ఇదో కన్నప్ప ప్రచారంగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే మంచు ఏం చేసినా వైరలే..