శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్‌

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (15:43 IST)
Reba Monica John
శ్రీ విష్ణు కొత్త సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైంది.  రామ్ అబ్బరాజు 'వివాహ భోజనంబు' (ఓటీటీ రిలీజ్) తో ఆకట్టుకున్నారు. శ్రీ విష్ణుతో చేస్తున్న ఈ కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం అవుతున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ పతాకంపై రజేష్ దండా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన కథానాయికగా నటించడానికి నటి రెబా మోనికా జాన్‌ను నిర్మాతలు ఎంపిక చేశారు. రెబా మోనికా గతంలో మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో ఆకట్టుకున్నారు.
 
హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్‌ అందిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది.
 
గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
తారాగణం: శ్రీ విష్ణు,  రెబా మోనికా జాన్ , సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

పోలీస్ స్టేషన్‌కి సాయం కోసం వెళ్తే.. అందంగా వుందని అలా వాడుకున్నారు..

వేడిపాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. ఎక్కడ?

కడపలో భారీ స్థాయిలో నకిలీ జెఎస్‌డబ్ల్యు సిల్వర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆ యాప్‌లో కనెక్ట్ అయ్యాడు- హైదరాబాద్‌లో వైద్యుడిపై లైంగిక దాడి.. బయట చెప్తే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments