Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దోస్త్ లంద‌రికీ ఆంథ‌మ్ సాంగ్‌గా ఫ్రెండ్షిప్ సాంగ్

Advertiesment
Uday Shankar, Jennifer Emmanuel,  Sri Vishnu, Nara Rohit, and others
, సోమవారం, 8 ఆగస్టు 2022 (20:35 IST)
Uday Shankar, Jennifer Emmanuel, Sri Vishnu, Nara Rohit, and others
ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు.
 
ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి  'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..' అనే లిరికల్ సాంగ్ ను నిజజీవితంలో మంచి మిత్రులు అయిన టాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న రోహిత్, శ్రీవిష్ణు చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ గోపీచంద్,  పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ బాబు వంశీ పైడిపల్లి ఇలాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ సంద‌ర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ ః  ప్రెండ్ షిష్  డే సంద‌ర్భంగా విష్ణుతో క‌ల‌సి ఈ సాంగ్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూస‌ర్ అట్లూరి నారాయ‌ణ గారు నాకు మంచి ఆప్తులు. న‌చ్చింది గాళ్ ఫ్రెండ్  బాగా వ‌స్తుంద‌ని తెలిసింది. టీం అంద‌రికీ ఆల్ ద బెస్ట్  అన్నారు.
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూః రోహిత్ తో క‌లసి ప్రెండ్ షిప్ డే సాంగ్ లాంఛ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.  టీం అంద‌రూ నాకు చాలా కాలంగా తెలుసు. నచ్చింది గర్ల్ ఫ్రెండూ క‌థ‌, క‌థ‌నాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు గురు ప‌వ‌న్ చాలా టాలెంటెడ్ . ఈ పాట మంచి హిట్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. సినిమా టీం అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
 
సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూః పాడుతున్న‌ప్పుడే చాలా ఎంజాయ్ చేసాను. దోస్త్ లంద‌రికీ ఇది ఒక ఆంథ‌మ్ సాంగ్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం.  ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ ద‌ర్శ‌కుడు గిఫ్ట‌న్ కి ద‌ర్శ‌కుడు గురు ప‌వ‌న్ కి థ్యాంక్స్ అన్నారు.
 
నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్,  మధునందన్,  సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
 
సాంకేతక వర్గం: సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్:   సాగర్  ఉడగండ్ల  ఆర్ట్: దొలూరి నారాయణ,  పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా, నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సితారతో మహేష్ బాబు వాకింగ్.. వైరల్ ఫోటో