Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్లమ్ డాగ్ హజ్బెండ్ నుంచి బరాత్ సాంగ్ విడుద‌ల చేసిన రవితేజ

Advertiesment
Ravi Teja, Sanjay Rao, Pranavi Manukonda
, గురువారం, 22 సెప్టెంబరు 2022 (17:38 IST)
Ravi Teja, Sanjay Rao, Pranavi Manukonda
సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా "స్లమ్ డాగ్ హజ్బెండ్". ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 
చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. తాజాగా "స్లమ్ డాగ్ హజ్బెండ్" సినిమా నుంచి బరాత్ సాంగ్ ను మాస్ రాజా రవితేజ విడుదల చేశారు. పాటలో చాలా జోష్ ఉందని, పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని మూవీ టీమ్ కు విశెస్ తెలిపారు.  ఈ పాట ఎలా ఉందో చూస్తే...లచ్చి గాని పెళ్లి ఇగ పార్శి గుట్టల లొల్లి. లచ్చిగాని పెళ్లి నువు మర్పా కొట్టర మళ్లీ..అంటూ సాగే ఈ పాట  బరాత్ సాంగ్ ఆఫ్ సెంచరీ గా నిలవనుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా..భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి పాడారు. బరాత్ సందడి, ఉత్సాహం అంతా ఈ పాటలో కనిపించింది.  సినిమా ఎంత మాస్ ఎంటర్ టైనర్ గా ఈ పాట ఉంటుందో తెలియజేస్తోంది.
 
ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ - వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ - శ్రీనివాస్ జె రెడ్డి, సంగీతం - భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం - కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి, పీఆర్వో - జీఎస్కే మీడియా, లైన్ ప్రొడ్యూసర్ - రమేష్ కైగురి, బిజినెస్ హెడ్ : కొ వె ర, సహ నిర్మాతలు - చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం, నిర్మాతలు - అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రచన దర్శకత్వం - డాక్టర్ ఏఆర్ శ్రీధర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ధనుష్, సందీప్ కిషన్ న‌టిస్తున్నకెప్టెన్ మిల్లర్‌