Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా.. ద‌ర్శ‌కుడిగా మారాను - శ్రీనివాస‌రెడ్డి

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (20:49 IST)
ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతుంది. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి అస‌లు త‌ను ఎందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌గా మారాల్సి వ‌చ్చిందో తెలియ‌చేసారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీని ప్రొడ్యూస్ చేయాల‌ని చాలా రోజులుగా అనుకునేవాడిని. అలాంటి స‌మ‌యంలో నేను చేయాల్సిన ఓ సినిమా 20 రోజుల పాటు వాయిదా ప‌డింది. ఆ స‌మ‌యంలో నాతో జ‌యమ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమా చేసిన ప‌రం చెప్పిన పాయింట్ మీద క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాం. 
 
క‌థ చాలా బాగా వ‌చ్చింది. దాంతో సినిమా మా క‌మెడియ‌న్స్ గ్రూప్ ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకున్నాను అని శ్రీనివాస‌రెడ్డి చెప్పారు. అయితే... చాలా మంది క‌మెడియ‌న్స్ వ‌స్తే కొత్త ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేస్తాడో లేదోన‌నిపించింది. అందుక‌నే నేనే సినిమాను డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాను. 
 
నేను ద‌ర్శ‌క నిర్మాత‌గా చేయ‌బోయే సినిమా గురించి మా ఆర్టిస్టుల‌కు చెప్పగానే త‌మ నుండి ఎలాంటి సాయం కావాల‌న్నా చేస్తామ‌ని అన్నారు. నేను వారికి ఎలాంటి రెమ్యున‌రేష‌న్స్ ఇవ్వ‌లేదు. ఓన్ రిలీజ్ చేస్తుండ‌టం వ‌ల్ల రిలీజ్ త‌ర్వాతే డ‌బ్బులు తీసుకుంటామ‌ని అంద‌రూ అన్నారు. అలా నేను `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు` సినిమాకు డైరెక్ట‌ర్‌గా మారాను అని శ్రీనివాస‌రెడ్డి తెలియ‌చేసారు. మ‌రి... ఈ సినిమా శ్రీనివాస‌రెడ్డికి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments