Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయల్ బెంగాల్ దంపతులకు ఐదు పిల్లలు.. ఒకదానికి 'జగన్' పేరు

Advertiesment
రాయల్ బెంగాల్ దంపతులకు ఐదు పిల్లలు.. ఒకదానికి 'జగన్' పేరు
, శనివారం, 5 అక్టోబరు 2019 (10:01 IST)
తిరుపతిలో శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వుంది. ఇందులో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. వీటిలో సమీర్ - రాణి పులుల జంటకు ఐదు పులి పిల్లలు పుట్టాయి. ఈ పిల్లలు నామకరణం వైభవంగా జరిగింది. రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ పిల్లలకు పేర్లు ఖరారు చేసి పెట్టారు. వీటిలో ఓ పిల్లకు జగన్ అని పేరు పెట్టారు. 
 
తిరుపతి జూలో తెల్ల పులుల జంట సమీర్, రాణిలకు ఐదు పిల్లలు పుట్టాయి. వీటిలో మూడు మగ కూనలు, రెండు ఆడ కూనలు ఉన్నాయి, మగ పిల్లలకు వాసు, సిద్ధాన్, జగన్ అని, ఆడ కూనలకు విజయ, దుర్గ అనే పేర్లను బాలినేని ఖరారు చేశారు.
 
కాగా, మగ కూనల్లో చిన్నదానికి తమ అధినేత పేరును పెట్టడం ద్వారా, ఆయనపై తనకున్న అభిమానాన్ని బాలినేని చాటుకున్నట్లయింది. ఇక, పెద్ద కూనకు పెట్టిన పేరుపైనా చర్చ జరుగుతోంది. 
 
బాలినేనిని ప్రకాశం జిల్లాలో అభిమానులంతా 'వాసు' అని పిలుస్తుంటారు. ఇప్పుడీ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ ఐదు కూనలనూ చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 మంది అమ్మాయిలని లొంగదీసుకుని ఎంజాయ్... బార్బీ గర్ల్ 5 చితక్కొట్టేసింది...