Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీర తో అలరించబోతున్న శ్రీమురళి

డీవీ
సోమవారం, 21 అక్టోబరు 2024 (16:04 IST)
Srimurali
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
 
దేవుని అవతారాల గురించి తల్లి, ఆమె కొడుకు మధ్య సీరియస్ సంభాషణతో ట్రైలర్ ప్రారంభమైంది. అరాచకాలని అంతం చేయడానికి దేవుడు అనేక రూపాల్లో వస్తాడని, దేవుడి లానే కాదు రాక్షసడిలా కూడా రావచ్చని చెబుతుంది. నేరస్థులను నిర్మూలిస్తున్న మాస్క్ మ్యాన్ బఘీరని స్థానికులకు దేవుడి రూపంలో, పోలీసులు అతన్ని క్రిమినల్ గా చూస్తారు.
 
ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ కథను రాశాడు, డాక్టర్ సూరి గ్రిప్పింగ్ నేరేషన్, ఇంపాక్ట్ఫుల్ సంభాషణలతో ప్రజెంట్ చేశాడు. శ్రీమురళి పోలీసు అధికారిగా, మాస్క్ మ్యాన్  బఘీరగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. రుక్మిణి వసంత్ అతని లవ్ ఇంట్రస్ట్ గా కనిపించారు. ట్రైలర్‌లో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రముఖ నటులను కూడా పరిచయం చేశారు.
 
AJ శెట్టి సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. B అజనీష్ లోక్‌నాథ్ థంపింగ్  స్కోర్‌తో యాక్షన్ ని ఎలివేట్ చేశాడు. నిర్మాణ విలువలు ఫస్ట్-క్లాస్ గా వున్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్‌గా ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి సంతేహక్లు పని చేస్తున్నారు.
 
ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచిన బఘీర అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments