విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. పసుపు పండుగలో మెరిసింది.. (ఫోటోలు)

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (15:59 IST)
Sobhita Dhulipala
నటి శోభితా ధూళిపాళ, తెలుగు స్టార్ హీరో నాగ చైతన్య పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట డ్రెండ్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగు సంస్కృతిలో భాగంగా వివాహ ఉత్సవాల ప్రారంభాన్ని సూచించే పసుపు దంచడం వేడుకలో శోభితా పాల్గొన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో శోభితా ఈ ఫోటోలను పంచుకున్నారు. ఇంకా పెళ్లి వేడుకలు ప్రారంభం అంటూ హింట్ ఇచ్చారు. 
Sobhita Dhulipala
 
ఈ సందర్భంగా, శోభిత బంగారు జాకెట్టు, పగడపు, ఆకుపచ్చ రంగు సిల్క్ చీరను ధరించారు. ఇరువైపులా విభిన్న రంగులతో కూడిన బార్డర్ కలిగిన చీరలో శోభిత మెరిసిపోయారు. 
Sobhita Dhulipala
 
వివాహానికి ముందు జరిగే వేడుకల కోసం బంగారు ఆభరణాలు, ఆకుపచ్చ గాజులతో చూడముచ్చటగా కనిపించింది. ఈ పసుపు దంచుడు కార్యక్రమంలో శోభిత కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments