Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ-సుధీర్‌లా రవి కృష్ణ- నవ్య స్వామి పెళ్లి చేసుకోబోతున్నారా? (video)

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (21:59 IST)
Ravi Krishna_Navya swamy
స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఆమె కథ సీరియల్‌లో నటిస్తోన్న హిట్ పెయిర్ రవి కృష్ణ- నవ్య స్వామి పెళ్లి చేసుకోబోతున్నారు. అవును.. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే రియల్ కాదు ఒక షో కోసం. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం ఈ షోను ప్రసారం అవుతోంది. 
 
ఇందులో ఒక్కో ప్రాంతానికి వెళ్లనున్న ఈ షో టీమ్.. అక్కడి టాలెంట్‌ని వెలికితీస్తోంది. అలాగే బుల్లితెర సెలబ్రిటీలు సైతం ఇందులో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఆదివారం రాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. 
 
ఇందులో బుల్లితెర నటీనటులు రవికృష్ణ- నవ్య స్వామిల పెళ్లి చేయబోతున్నారు. అప్పట్లో బుల్లితెర హిట్ జోడీ సుధీర్-రష్మి పెళ్లి తరహాలో ఇప్పుడు ఈ ఇద్దరి వివాహం ఉండబోతోంది. ఇక ప్రోమోలో ఈ ఇద్దరు రొమాన్స్ కూడా చేశారు. ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుంటూ తమ మధ్య నిజమైన ప్రేమ ఉందన్నట్లుగా చూపించారు. అయితే గతంలోనూ సుమ క్యాష్ షోలో నవ్య స్వామి- రవికృష్ణలు వారి మధ్య ప్రేమ ఉన్నట్లు చూపించారు. ఈ వారం షోకు ముఖ్య అతిథిగా రాజీవ్ కనకాల రానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments