Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుమ షో అదుర్స్.. నరేష్‌ను కర్రతో కొట్టిందిగా..!

Advertiesment
సుమ షో అదుర్స్.. నరేష్‌ను కర్రతో కొట్టిందిగా..!
, మంగళవారం, 17 నవంబరు 2020 (10:19 IST)
యాంకర్ సుమ తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో 'క్యాష్-దొరికినంత దోచుకో'ను నిర్వహిస్తోంది. ఎప్పటిలాగానే వచ్చే శనివారం 'క్యాష్‌' సెట్‌లో పలువురు సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. ప్రేక్షకాదరణ పొందుతున్న నరేష్‌, రిత్విక , యోధ, దీవెన శ్రీమయి, మురారి, సాహితి, విన్నీ.. సుమతో కలిసి క్యాష్‌ సెట్‌లో నవ్వులు పూయించనున్నారు.
 
ప్రోగ్రామ్‌లో భాగంగా నరేష్‌, రిత్విక, యోధ, దీవెనలతో కలిసి సుమ ఓ సరదా స్కిట్‌ చేయనున్నారు. 'ఆన్‌లైన్‌ క్లాసులు' కాన్సెప్ట్‌తో రానున్న ఈ స్కిట్‌లో భాగంగా సుమ-నరేష్‌ వేసే పంచులు ఆకట్టుకోనున్నాయి. 
 
అంతేకాకుండా ఏదైనా పద్యం చెప్పమని సుమ కోరడం.. దానికి నరేష్‌.. 'ఒక లైలా కోసం' అంటూ పాట పాడడం.. వెంటనే సుమ నరేష్‌ని సరదాగా కర్రతో దెబ్బలు వేయడం.. ఇలా ఈ షో ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. వచ్చే శనివారం (నవంబర్‌ 21) ప్రసారం కానుంది. ప్రోమోను ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"స్థానికం" పూర్తయ్యేంత వరకు కొత్త జిల్లాలు వద్దు.. పాత ప్రాదికనే "ఎన్నికలు"