Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూసధోరణికి భిన్నంగా 'డిస్కోరాజా'.. రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే? (Video)

Advertiesment
మూసధోరణికి భిన్నంగా 'డిస్కోరాజా'.. రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే? (Video)
, శుక్రవారం, 24 జనవరి 2020 (16:24 IST)
నటీనటులు: రవితేజ, బాబీ సింహా, పాయల్‌ రాజ్‌ పుత్‌, నభా నటేష్‌, తన్య హోప్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌,  గిరిబాబు, నరేష్‌, సత్య, జీవా తదితరులు
సాంకేతికవర్గం:
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, 
సంగీతం: తమన్‌, 
నిర్మాత: రామ్‌ తాళ్లూరి, 
రచన, దర్శకత్వం: వీఐ ఆనంద్‌
 
మూసధోరణి కథల్తో ఏదో ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి కేవలం ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేస్తున్న ఈరోజుల్లో ఏదో కొత్త ప్రయోగం చేయాలని రవితేజ చేసిన చిత్రం 'డిస్కోరాజా'. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశాలతో అనుభవం వున్న వీఐ. ఆనంద్‌ ఈసారి మనిషి చావు, బతుకు మధ్య చిన్న అంశాన్ని తీసుకుని ప్రేక్షకుడి స్థాయిని పెంచేదిశగా ప్రయత్నం చేశారు. శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏమేరకు చేరిందో చూద్దాం.
 
కథ:
లఢాక్‌ పర్వతాల్లోని ఐస్‌లాండ్‌లో మంచుతో కూడిన మృతదేహాన్ని పర్వాతారోహణ బృందం చూసి అక్కడి శాస్త్రవేత్తలకు తెలియజేస్తుంది. నిర్జీవంగా వున్న ఆ వ్యక్తిని బతికించాలనే పట్టుదలతో అక్కడి సీనియర్‌ డాక్టర్‌ బృందం ప్రయత్నిస్తుంది. చివరికి వారి ప్రయత్నం ఫలించి జీవం పోసుకుంటుంది ఆ ప్రాణం. అతనే రవితేజ. ఈ ప్రయోగంతో రవితేజ గతాన్ని మర్చిపోతాడు. 
 
అయితే అతని గతాన్ని గుర్తుకుతెచ్చే ప్రయత్నం చేయడానికి డాక్టర్‌ బృందంలోని సభ్యులు తాన్య, వెన్నెల కిశోర్‌ ప్రయత్నిస్తారు. చివరికు తాను డిస్కోరాజా అనే డాన్‌ అని అతనికి స్పురిస్తుంది. ఇంకోవైపు ఢిల్లీలో వాసు (రవితేజ) ఇంటికి అప్పులవాళ్ళు వచ్చి వారి కుటుంబసభ్యుల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. వారంతా బతిమాలగా చివరికి వారి గోడువిని వచ్చినవాల్ళు వాసు కుటుంబసభ్యులికి 10రోజులు టైమ్‌ ఇస్తారు.
 
ఆ తర్వాత డిస్కోరాజా సిటీకి వచ్చి తన చావుకు కారణమైన వారికోసం వేట మొదలుపెడతాడు. ఆ ప్రయత్నంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అవి ఏమిటి? ఇంతకీ వాసు ఎవరు? అనేదికూడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
webdunia
 



విశ్లేషణ:
'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో మనిషిలో నమ్మకాలనే కాన్సెప్ట్‌తో కొత్త ప్రయోగం చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోసి బతికిస్తే ఎలా వుంటుందనే కాన్సెప్ట్‌తో వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. హాలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలు వచ్చినా తెలుగులో ఇదే కావడం విశేషం. మెడికల్‌ సీరెర్చ్‌లో స్టెన్సిల్స్‌తో బాడీ ఆర్గాన్నే కాదు ప్రాణాన్ని కూడా తిరిగి పోయవచ్చనే గట్టినమ్మకంతో ఓ డాక్టర్‌ బృందం ప్రయత్నాలు చేస్తుంది. 
 
లక్ష్మణుడికి సంజీవి ద్వారా ప్రాణం పోసినట్లే.. ఇప్పుడు మేథావి అయిన డాక్టర్లు చనిపోయిన వ్యక్తికి జీవం పోసి బతికించడం అన్నమాట. ఈ పాయింట్‌ కథలో కీలకం. అలా ప్రయోగాలతో బయటపడ్డ రవితేజ ఆ తర్వాత ఏం చేశాడనేది ఆసక్తికరం. 35 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోస్తే అతను మళ్లీ ఈ లోకంలోకి వచ్చి స్పందించే వైనం ఎలా ఉంటుందన్న ఉత్సుకత ప్రేక్షకుడిలో ఉంటుంది. 
 
ఇంతవరకు కొత్తగా వున్న ఆ తర్వాత అంతా పూర్తి సినిమాటిక్‌గానే వుంటుంది.  సినిమా అంటేనే జరగదు అన్న విషయాన్ని జరిగేట్లుగా చేసి భ్రమలోకి తీసుకెళ్ళడమే. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫీలింగ్‌ కలుగుతుంది.ఈ కథలో రవితేజను చూడటం కొత్తగా అనిపిస్తుంది.

మూడున్నర దశాబ్దాల పాటు ఈ లోకానికి దూరంగా ఉండి ఉన్నట్లుండి ఈ ప్రపంచంలోకి వచ్చే వ్యక్తి పాత్రతో ఆసక్తికర ఎపిసోడ్లు సన్నివేశాలు రాసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ సాదాసీదాగా మార్చేశాడు దర్శకుడు. అయితే తనెవరు అనేది తెలిసేలోపే ఇంటర్‌వెల్‌కు వచ్చేస్తుంది. 
webdunia
 
సినిమాకు ద్వితీయార్థమే కీలకం. అది ఎంత ఆసక్తికరంగా వుంటే చిత్రం అంతగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఒక్కసారిగా 35 ఏళ్ళ వెనక్కు తీసుకెళ్లి 80ల నేపథ్యంలో రెట్రో స్టయిల్లో సాగే ఫ్లాష్‌ బ్యాక్‌ కొత్తగా వుంది. చెన్నైలో చిన్నచిన్న దొంగతనాలనుంచి డాన్‌గా ఎదిగిన డిస్కో రాజాకు బర్మా సేతు (బాబీ సింహ) ప్రత్యర్థి. వీరిద్దరి మధ్య జరిగిన వార్‌ చివరికి డిస్కోరాజాను చంపేసే స్థితికి వస్తుంది.

ఇక అప్పట్లో  రవితేజ, పాయల్‌ మధ్య సాగే ప్రేమాయణం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత పగ ప్రతీకారంతో సినిమా సాగుతుంది. ఇందులో ట్విస్ట్‌ ఏమంటే.. డిస్కోరాజాకూ వాసు మధ్య వున్న సంబంధం ఏమిటినేది. ఇంకోవైపు డిస్కోరాజా గ్యాంగ్‌లో అమాయకుడైన ఉత్తరకుమార్‌ (సునీల్‌) పాత్ర ట్విస్ట్‌ బాగుంది. అయితే ఆ పాత్రను మరింత ఆసక్తిగా చూపిస్తే బాగుండేది.  
webdunia
 
తన పాత్రలోని భిన్న పార్వాశాలను రవితేజ మెప్పించాడు. ఎనర్జీ లుక్‌తో డాన్స్‌లు బాగా చేశాడు. వర్తమానంలో రవితేజ పాత్ర సాదాసీదాగానే వుంటుంది. పాయల్‌ రాజ్‌ పుత్‌ గత సినిమాలతో పోలిస్తే ఇందులో బాగానే కనిపించింది. నభా నటేష్‌, తన్య పాత్రల గురించి చెప్పడానికేమీ లేదు. విలన్‌ పాత్రలో బాబీ సింహా ఆకట్టుకున్నాడు.

వెన్నెల కిషోర్‌ హీరో పక్కనే ఉంటూ కొంత మేర వినోదం పంచాడు. సునీల్‌ ఏదో కొత్తగా ట్రై చేశాడు పెద్దగా రుచించలేదు. అందుకే చివర్లో.. ఇప్పటివరకు కెరీర్‌లో ఎప్పుడూ చేయని చాలా వేరివేషన్స్‌ చూపించావ్‌ చాల్లే.. అంటూ అతనిపై సెటైర్‌గా వేయించాడు దర్శకుడు. సత్య, సీరియర్‌ నరేష్‌, సత్యం రాజేష్‌ నటన పర్వాలేదు.
 
తమన్‌ సంగీతం ఆకర్షణగా వుంటుంది. ఓ థీమ్‌ సాంగ్‌ బాగుంది. అలాగే 'నువ్‌ నాతో ఏమన్నావో' పాట కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం సినిమా అంతటా బాగుంది. కార్తీక్‌ ఘట్టమనేని కెమెరా పనితనం కూడా సినిమాకు మరో ఆకర్షణ. 80ల నేపథ్యంలో సన్నివేశాల్లో ఆర్ట్‌ వర్క్‌ కూడా బాగుంది.

వినూత్నమైన ఆలోచనతో రామ్‌ తాళ్లూరి ఏమాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించాడు. దర్శకుడు వీఐ ఆనంద్‌ సైన్స్‌ఫిక్షన్‌ అంశాన్ని తీసుకున్నా చివరికి ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ముడిపెట్టేశాడు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు వస్తేనే రొటీన్‌ ఫార్మెట్‌కు రిలీఫ్‌ వుంటుంది. అయితే ఇలాంటివి ప్రేక్షకులు ఆదరణబట్టే సక్సెస్‌ మరింతగా వుంటుంది.
 
రేటింగ్‌: 3/5
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెడ్రూమ్‌లోకి లాక్కెళ్లి.. చేతులు మంచానికి కట్టేసి అత్యాచారం చేశాడు.. హాలీవుడ్ నటి