Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌లో అలియా భట్ స్పెషల్ సాంగ్.. సూపర్ హిట్ ఖాయం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (14:32 IST)
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా జక్కన్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ, అలియా భట్ ఫీమేల్ లీడ్‌గా కనిపిస్తుంది. కొద్ది రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కోసం అలియా, హైదారాబాద్‌కి రానుంది. ఐతే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆలియా గొంతు వినిపించనుందట.
 
ఆర్‌ఆర్‌ఆర్‌లో ఒకానొక ప్రత్యేక గీతాన్ని ఆలియా ఆలపించనుందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఆలియా, ఇది వరకు చాలా సినిమాల్లో పాటలు పాడింది. అవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. ఐతే ఈ సారి అటు హిందీతో పాటు తెలుగులో కూడా పాడి వినిపిస్తుందట. ఇప్పటికే తెలుగు భాష నేర్చుకుంటున్న ఆలియా, పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
 
ఇదిలా ఉంటే.. తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ వారితో ఇందులోని హీరోలు పోరాడుతోన్న సీన్లకు సంబంధించిన షూటింగును తీస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నైట్ షూట్ తీస్తున్నామని, యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ చెప్పింది. దీన్ని థియేటర్‌లో చూసేటప్పుడు మరో లెవల్లో ఉంటుందని ఆ యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments