Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాత్తైకి రాత్రి పూట షూటింగ్‌కు అనుమతి.. కర్ఫ్యూ సమయంలో..?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:31 IST)
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతుండడంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గం.ల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని వారు తెలిపారు. అయితే కర్ఫ్యూ వలన చాలా చిత్ర షూటింగ్స్ వాయిదా పడ్డాయి. రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్‌కు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ క్రమంలో వారు పోలీసుల నుండి ప్రత్యేక అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
 
అన్నాత్తె చిత్ర షూటింగ్ కోసం రజనీకాంత్ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్ర షూటింగ్ జరుగుతుంది. దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనే భావనలో మేకర్స్ ఉండగా, వీలైనంత తొందరగా మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం కర్ఫ్యూ సమయంలోను షూటింగ్ చేసేందుకు అనుమతిని కోరుతున్నారని తెలిసింది. 
 
కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంకు డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్‌. ఎడిటర్‌గా రూబెన్‌ వ్యవహరిస్తున్నారు. కరోనా ఉదృతంగా ఉన్న ఈ సమయంలో రజనీకాంత్ షూటింగ్ చేయడం గొప్ప విషయమే.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments