కరోనా ఫస్ట్ వేవ్‌లో వలసకూలీలను ఆసరాగా నిలిచాడు సోనూసూద్. ఆ తర్వాత కొన్ని గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. ఎందరో అభాగ్యులను ఆదుకున్నాడు. ఇటీవలే ఓ మహిళలకు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అపోలో అసుప్రతిలో చికిత్స చేయించాడు. తాజాగా ఆయన గురువారంనాడు ఆక్సిజన్ సిలెండర్లను సరఫరా చేశాడు.
twitter post
దాంతో ఇవాళ దేశ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సోనూ సూద్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. నిన్న బెంగళూరులోని ఓ హాస్పిటల్ కు కొద్ది గంటల వ్యవథిలోనే ఆక్సిజన్ ను సరఫరా చేసి దాదాపు పాతిక పైగా ప్రాణాలను కాపాడిన సోనూసూద్ బృందం ఇప్పుడు ఆక్సిజన్ అవసరమైన హాస్పిటల్స్ కు దానిని అందించే పనిలో పడింది.
ప్రభుత్వాలు చేసే సాయం గురించి ఆలోచించకుండా మానవత్వంతో తనకు చేతనైనంత సాయం చేస్తున్నాడు సోనూసూద్. ఆయన టీమ్ ఈరోజు కొన్ని టన్నలు ఆక్సిజన్‌ను ఆయన బృందం దానిని ట్రక్కుల్లో హాస్పిటల్స్ కు పంపే పనిలో రేయింబవళ్లు కృషి చేస్తోంది. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, 'స్టే స్ట్రాంగ్ ఇండియా, ఆక్సిజన్ ఫ్రమ్ మై సైడ్ ఆన్ యువర్ వే' అంటూ బాధితులకు ఊరటను కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.