Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ రోగిని హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూసూద్!

Advertiesment
కోవిడ్ రోగిని హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూసూద్!
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (15:44 IST)
kovid flight
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారి కిసాన్ సోను సూద్ అవిశ్రాంతంగా, నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా  సోను సూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు.
 
కోవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి దాదాపు 85-90% ఊపిరితిత్తులను కోల్పోయింది, సోను ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు, ఇది హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నాడు, దీనిలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు. ఈ ECMO చికిత్స కోసం మొత్తం సెటప్ హైదరాబాద్ నుండి 6 మంది వైద్యులతో ఒక రోజు ముందుగానే రావాలి. ఇందుకోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో భారతికి ఉత్తమమైన చికిత్సను పొందగలిగారు.
 
దీని గురించి సోను సూద్ మాట్లాడుతూ, “అవకాశాలు 20% మాత్రమే అని వైద్యులు తెలిపారు. ఆమె 25 ఏళ్ల యువతి, అందుకే మేము ఈ అవకాశాన్ని తీసుకున్నాము, వెంటనే ఎయిర్ అబులెన్సు బుక్ చేసాము. హైదరాబాద్అ పోలో హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది” అన్నారు.
 
కోవిడ్ -19 పండమిక్ లో ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటి సందర్భం. భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి.
సోను సూద్ కు కరోనా పాజిటివ్ అని ఇటీవల తేలింది. హోమ్ quarantineలో ఉంటూ ఇవన్నీ చేయడం అభినందనీయం. అందుకే ఆయన రియల్ హీరో. అని వారు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కోతి కొమ్మచ్చి` యానిమేష‌న్ సాంగ్ ఆవిష్క‌రించిన‌ దిల్ రాజు