Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

నిజమైన ప్రాణదాత : 22 మంది ప్రాణాలు రక్షించిన సోనూసూద్

Advertiesment
నిజమైన ప్రాణదాత : 22 మంది ప్రాణాలు రక్షించిన సోనూసూద్
, బుధవారం, 5 మే 2021 (14:37 IST)
దేశంలో కరోనా  కష్టకాలం సాగుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలను చూసి వెండితెరపై కరుడుగుట్టిన విలన్‌గా కనిపించే నటుడు సోనూ సూద్ చలించిపోయారు. దీంతో నిజజీవితంలో హీరోగా అవతారమెత్తారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారు. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారుసోనూ సూద్ బృందం సభ్యులు. కర్ణాటకలోని సోనూసూద్‌ బృందం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 22 మంది రోగుల ప్రాణాలను రక్షించింది.
 
బెంగళూరులోని అరక్‌ హాస్పిటల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి అత్యవసర సందేశం అందింది. సకాలంలో ప్రాణవాయువు అందక ఇప్పటికే అక్కడ ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించిన సోనూసూద్‌ బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్‌ హాస్పిటల్‌కి 16 ఆక్సిజన్‌ సిలిండర్లను అందించింది. వాటిద్వారా ఆ 22 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలిచిపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన కర్ఫ్యూ.. వాహనరాకపోకలు బంద్