'సంజీవిని వ్యాక్సిన్' డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (14:55 IST)
Sonosud vaksin
ప్రఖ్యాత నటుడు సోనూ సూద్ బుధవారం అమృత్ సర్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో తెలియజేసే విధంగా సంజీవని అనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగేలా, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ఈ డ్రైవ్ ఉండబోతోంది. 
 
వ్యాక్సిన్ గురించి సోనూ సూద్ మాట్లాడుతూ, 'కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం చాల ముఖ్యం అనిపించింది. అందుకే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభిస్తున్నాను. కొంతమంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోని వృద్దులు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ చాలా  ఉపయోగపడు తుందని సోనూసూద్ తెలిపారు.
పంజాబ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ వ్యాక్షిన్ ను అందచెయ్యబోతున్నాము. గ్రామీణ ప్రజలు వ్యాక్షిన్ వేయించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు కావున ఈరోజు అందరి ముందు వ్యాక్షిన్ వేయించుకోవడం జరిగిందని సోనూసూద్ తెలిపారు. త్వరలో పలు ఏరియాల్లో వ్యాక్షిన్ క్యాంపులు ప్రారంభిస్తున్నానని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments