Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనుసూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం - (video)

సోనుసూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం - (video)
, శనివారం, 20 మార్చి 2021 (14:43 IST)
sonusood jet
SpiceJet, Sonu Sood
నటుడు సోనూసూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంతచెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తమవంతు సహాయాన్ని అందించారు.

వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్నపేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారివారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూసూద్ కృషి మరువలేనిది. ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమవారిని చేరుకున్నారు. లాక్ డౌన్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సాయంతో ఊరట పొందారు. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ను కొనియాడింది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు. 
 
ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు. ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్ అనే క్యాప్షన్ వేశారు. ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు.
 
స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూసూద్ చాలా సంతోషంగా ఉన్నారు. తనతో కలిసి లాక్ డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న సోనూసూద్ ఇక మీదట కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి ఫోన్ చేసి ఆ మాట అడిగాడు: జబర్దస్త్ వర్షపై ఇమ్యాన్యుయెల్‌ సామజవరగమనా...