డ‌బ్బు మ‌నిషి సోనూసూద్ అంటున్న‌ త‌మ్మారెడ్డి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:50 IST)
sonu- Tammareddy
ఒక‌ప్ప‌డు డ‌బ్బు మ‌నిషిగా వున్న సోనూసూద్ ష‌డెన్‌గా దేవుడిలా ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డం నాకే ఆశ్చ‌ర్య‌మేస్తుంద‌ని త‌మ్మారెడ్డి భ‌రద్వాజ అంటున్నారు. ఇప్పుడు ఎక్క‌డా చూసిన  క‌రోనా పాలిట దేవుడిగా సోనూసూద్ పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ మంత్రి కె.టి.ఆర్‌.కూడా అస‌లైన హీరో నువ్వే అంటూ సోనూసూద్‌ను మెచ్చుకున్నారు. మ‌రి అస‌లు సోనూసూద్ క‌మ‌ర్షియ‌ల్ మెంటాలిటీ అని త‌మ్మారెడ్డి అంటున్నారు. 
 
తమ్మారెడ్డి ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. సోనూసూద్ ప్ర‌స్తావన రాగానే  తనకు నాలుగైదు సంవత్సరాల క్రితం సోనుతో జ‌రిగిన సంఘ‌ట‌న గుర్తుకువ‌స్తుంది.  ఓ విష‌యంలో షాక్ అయ్యాను కూడా. వికలాంగుల కోసం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి సోనూసూద్ ను విచ్చేయవలసిందిగా నిర్వాహ‌కులు న‌న్ను అడిగారు. సోసూతో మాట్లాడ‌మ‌ని. నేను ఆయ‌న్ను సంప్ర‌దించా. కానీ సోనూ దానికి డబ్బు చెల్లించాలని చెప్పాడు. దీంతో సోనూసూద్ చాలా కమర్షియల్ అనే అంచ‌నాకు వ‌చ్చేశాను. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు చూస్తే దేవుడిలా కన్పిస్తున్నాడని, ఆయన చేస్తున్న సేవలు చూస్తుంటే తన అభిప్రాయం మారిపోయిందని వెల్ల‌డించారు.

మ‌రి ఇంత డ‌బ్బు  వెచ్చించ‌డానికి ఆయ‌న ఆస్తులు ఏమేర‌కు ఖ‌ర్చుచేస్తున్నారోన‌ని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంద‌ని చెప్పారు. అయితే ఈ సేవాగుణం త‌న త‌ల్లి నుంచి వ‌చ్చింద‌నీ, ఆమెకిచ్చిన మాట ప్ర‌కారం చేస్తున్నాన‌ని ఓ సంద‌ర్భంలో అన్న విష‌యాలు అత‌న్ని మార్చేశాయ‌ని అనుకుంటున్నాన‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments