Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (14:29 IST)
బాలీవుడ్ హీరో సోనూసూద్‌కు ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని కావాలనే సెన్సేషనల్ చేస్తున్నారని తెలిపారు. తనకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు తనను పిలిచినట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే ఆంశంపై ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
"నాకు ఎటువంటి సంబంధం లేని మూడో పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం నన్ను సాక్షిగా సమన్లు జారీచేసింది. అందుకు మా న్యాయవాదులు స్పందించారు. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. మాకు ఏ విధంగాను సంబంధఁ లేదు. సెలెబ్రిటీలు ఇలా అనవసర విషయాలకు లక్ష్యాలుగా మారడం విచారకరం. పబ్లిసిటీ కోసం నా పేరును వాడుతున్నారు. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం" అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఓ కేసులో వాంగ్మూలం నమోదు చేసేందుకు హాజరుకాకపోవడంతో సోనూ సూద్‌పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీచేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రతన్ టాటా వీలునామా రాసిన ఆ రహస్య వ్యక్తి ఎవరు?

Pregnant Woman: గర్భిణీపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని రైలు నుంచి తోసేశాడు..

ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ప్రెగ్నెంట్ చేసిన పోలీసు, ఆపై ఫినాయిల్ తాగించాడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్.. కండువా కప్పిన జగన్

వివేకానంద రెడ్డి హత్య కేసు: అప్రూవర్ దస్తగిరిని బెదించారా? విచారణకు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments