Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Advertiesment
Visal-mada gaja raja

డీవీ

, బుధవారం, 22 జనవరి 2025 (20:16 IST)
Visal-mada gaja raja
హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుని , 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకు వెళుతున్న యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన 'మద గజ రాజా' ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స పీరియన్స్ ని అందించే ఎంటర్ ట్రైనర్. హీరో విశాల్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో అదరగొట్టారు. సంతానం కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
 
డైరెక్టర్ సుందర్.సి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ అందించారు. విజయ్ ఆంటోని పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమిళ్ లో ఘన విజయం సాధించి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని కూడా అద్భుతంగా అలరిస్తుందని మేకర్స్ తెలియజేశారు.
ఈ చిత్రంలో సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్ కీలక పాత్రలు పోషించారు.
 ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ డీవోపీగా పని చేశారు. విజయ్ ఆంటోని సంగీతం అందించారు. శ్రీకాంత్ ఎన్ బి ఎడిటర్.
మాటలు శశాంక్ వెన్నెలకంటి రాశారు.
 
నటీనటులు: విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్,  ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాల (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్, లొల్లు సభ మనోహర్, K.S జయలక్ష్మి, అజయ్ రత్నం, సుబ్బరాజు, ముత్తుకలై, అజగు మాస్టారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే