Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సితార వీడియో

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (12:17 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార సోషల్ మీడియాలో రాక్ స్టార్. ఆమె ఏం చేసినా అది సెన్సేషన్. దర్శకుడు పరుశురామ్‌తో సినిమా చేసేందుకు మహేశ్ సిద్ధమవుతున్నాడు. అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో మహేష్ ఒక కొత్త అవతారంలో దర్శనం ఇవ్వనున్నారట. 
 
ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో ఇంటివద్దనే ఉంటూ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్న సూపర్ స్టార్,  రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇక ఈ కరోనాను కట్టడి చేయడానికి ఇటీవల ఆరు సూత్రాలను తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించిన మహేష్, నేడు తన ముద్దుల తనయ సితార పాప, కరోనా కట్టడికి పాటించవలసిన పంచ సూత్రాల తాలూకు వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది.
 
ఈ వీడియోలో వీలైనన్ని ఎక్కువసార్లు చేతులను శుభ్రం చేసుకుని.. కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలని చెప్పింది. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఎక్కువైనట్లైతే వెంటనే సమీప డాక్టర్‌ని సంప్రదించాలని, అవకాశం ఉన్నంతవరకు ఇళ్లకే పరిమితం అయి సోషల్ డిస్టెన్స్‌ని పాటించాలని, దగ్గు, తుమ్ము వంటివి వచ్చినపుడు మన ముఖానికి చేతిని మోచేతివరకు గట్టిగా అడ్డుపెట్టుకోవాలని సూచించింది. 
 
అలానే మన చేతులతో ముక్కు, పెదాలు, కళ్ళను పదే పదే రుద్దడం వంటివి చేయవద్దని తన వీడియో బైట్ ద్వారా సితార సూచనలు చేసింది. ప్రస్తుతం సితార పంచ సూత్రాల వీడియో పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments