Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా అమెరికాలో విలయతాండవం.. 81వేల కరోనా కేసులు

కరోనా అమెరికాలో విలయతాండవం.. 81వేల కరోనా కేసులు
, శుక్రవారం, 27 మార్చి 2020 (11:59 IST)
చైనాలో పుట్టి ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఈ వైరస్ ఎంతలా వ్యాపించిందంటే.. ఈ విషయంలో చైనాను అమెరికా దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 81వేల కరోనా కేసులు నమోదవగా.. అమెరికాలో ఈ సంఖ్య 85వేలు దాటేసింది. మృతుల సంఖ్య కూడా ఇక్కడ 1000 దాటింది. 
 
ఇకపోతే.. మూడోస్థానంలో ఇటలీ ఉంది. ఇటలీలో 80వేలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే 5,32,263 మందికి సోకింది. వీరిలో 24,090 మంది మృత్యువాతపడ్డారు. 1,24,349 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. స్పెయిన్‌‌లో 57786 కేసులు నమోదవ్వగా.. 4365 మంది మృ తి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్.. శానిటైజర్‌ను ఆల్కహాల్ అని తాగేశాడు.. చివరికి?