కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హ్యాండ్ వాష్ కోసం శానిటైజర్లు వాడుతున్నారు. ఇలా జైలు ఖైదీల కోసం కూడా శానిటైజర్లు అందుబాటులో వుంచారు. అదే ఓ ఖైదీ ప్రాణాలు తీసింది.
జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా శానిటైజర్‌లను అందుబాటులో ఉంచగా, మందు వాసన రావడంతో, దాన్ని ఆబగా తాగేసిన ఓ రిమాండ్ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామన్ కుట్టీ అనే ఓ ఖైదీ, శానిటైజర్‌ను తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. కాగా శానిటైజర్‌ను ప్రభుత్వ ఆదేశానుసారం జైలులోనే ఖైదీలు తయారు చేశారు.
మంగళవారం రాత్రి వరకూ బాగానే ఉన్న అతను, బుధవారం జైలు గదిలోనే కుప్ప కూలాడని, ఆపై హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.