Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (17:27 IST)
Sirevennela family
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిగారికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. ది. 30/11/2021 ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు గౌ|| ముఖ్యమంత్రిగారి కార్యాలయం నుండి శాస్త్రిగారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. 
 
ఆసుపత్రి ఖర్చులన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌నేది శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఆదేశించినట్లుగా తెలియజేశారు. శ్రీ సిరివెన్నెల 30/11/2021 సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తులైనారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
 
శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. 
సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్‌మోహన్ రెడ్డిగారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 
ధన్యవాదాలు సార్.. 
- సాయి యోగేశ్వర్ మరియు ఇతర కుటుంబ సభ్యులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments