Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్న సునీత?

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (13:19 IST)
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, వ్యాఖ్యాతగా విధులు నిర్వహిస్తున్నారు సింగర్ సునీత. ప్రస్తుతం ఆమె ఒకవైపు భర్త.. మరొకవైపు పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా సునీత దగ్గరుండి చూసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు హీరోయిన్‌గా అవకాశం వచ్చినప్పుడు.. ఏం జరిగింది అనే విషయాన్ని మీడియాతో వెల్లడించారు. 
 
గులాబీ సినిమాలో సింగర్‌గా అవకాశం వచ్చినప్పుడు "ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో" అనే పాట పాడిన తర్వాత.. ఆ సినిమాతో సునీతకు కూడా మంచి సక్సెస్ అందుకుంది. గులాబీ సినిమాలో పాట బాగా సక్సెస్ అయిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ సినిమా కోసం హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని సునీతకు ఇచ్చారట.
 
కానీ సునీత హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఆ అవకాశం అతిలోకసుందరి శ్రీదేవికి కల్పించారు. అలాగే దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి కూడా తనకు హీరోయిన్‌గా అవకాశం కల్పించాలని చూశారు.
 
కానీ సునీతకు నటనపై ఆసక్తి లేకపోవడం వల్లే అవకాశాన్ని ఆమె వినియోగించుకోలేదు. అప్పటికే సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. అందుకే హీరోయిన్‌గా నటించే అవకాశం వదులుకున్నాను అని సునీత తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments