Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే.. సింగర్ సునీత హాజరవుతుందా?

Advertiesment
Sunitha
ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే ఒక సెలబ్రిటీ టాక్ షోను మొదలుపెట్టారు బాలయ్య. ప్రస్తుతం రెండో సీజన్ జరుగనుంది. ఈ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకొని.. నంబర్ వన్ స్థానంలో టిఆర్పీ రేటింగ్ సాధించింది.
 
ఇప్పుడు రెండవ సీజన్ మొదలయ్యి.. మొదటి ఎపిసోడ్ కూడా పూర్తయింది. ఇక మొదటి ఎపిసోడ్‌లో మాజీ సీ. ఎమ్. నారా చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు నారా లోకేష్ వచ్చి రాజకీయ విషయాలను, తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.
 
ఇప్పుడు రెండవ సీజన్‌కి యంగ్ హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరూ హాజరు కాబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది. 
 
ఇకపోతే అందరికీ మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. త్వరలోనే సింగర్ సునీత కూడా అన్ స్టాపబుల్ షోకి గెస్ట్‌గా రాబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే సునీతతో పాటు భర్త రామ్ వీరపనేనితో పాటు తన కూతురు అలాగే కొడుకు ఆకాష్ కూడా హాజరు కాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హంట్ టైటిల్ పై వివాదం, ఫిలిం ఛాంబ‌ర్ కూడా ప‌రిష్క‌రించ‌లేక‌పోయింది