Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ మంచి కాఫీ లాంటి అబ్బాయి: సింగర్ సునీత

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (16:56 IST)
ప్రముఖ సింగర్ సునీత, రామ్ వీరపనేనిల పెళ్లి రోజు సందర్బంగా సింగర్ సునీత తన భర్త గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో తన భర్త రామ్‌ గురించి ఎంతో గొప్పగా సునీత చెప్పుకొచ్చారు. తన భర్త మంచి మనసున్న వ్యక్తి అని.. గడిచిన సంవత్సరంలో తన జీవితంలో ఎన్నో మధురమైన అనుభూతులు అందించారని ఆమె చెప్పారు. పెళ్లి రోజు సందర్భంగా తన పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కూడిన ఒక స్పెషల్‌ వీడియోను సునీత సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు.
 
తనకు, రామ్‌కు మధ్య ఎనిమిదేళ్ల నుంచే పరిచయం ఉందని.. అతనొక మంచి కాఫీ లాంటి అబ్బాయ్‌ అని రామ్ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు సునీత రామ్ లకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మీరు కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. 
 
అలాగే సినీ నటులు కూడా సునీత, రామ్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే తన అభిమానుల కోసం సునీత తమ ఇద్దరు పిల్లలు, భర్త రామ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేస్తూ.. మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సునీత ఫ్యామిలీ ఫొటోని షేర్ చేశారు. ఆ ఫొటో చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సునీత ఫ్యామిలీ చూడడానికి రెండు కళ్ళూ చాలటం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments