వివాహం అంటేనే పట్టు చీరలే గుర్తుకు వస్తాయి. వధువు కోసం భారీగా వెచ్చించి కొంటూ వుంటారు. ఇంకా పెళ్లికి విచ్చేసే మహిళలు కూడా తాము ధరించే పట్టు చీరలపైనే దృష్టి సారిస్తారు. ఇంతకీ పెళ్లిలో వధువు పట్టుచీరనే ఎందుకు ధరిస్తుందో తెలియాలంటే ఈ కథనం చదవండి. పెళ్లిళ్లలో పట్టుచీరలు ధరించడం వెనుక గల రహస్యం ఏంటంటే.. పట్టు వస్త్రాలకు పట్టుకు ప్రకృతిపరంగా ఒకే గుణం వుంటుంది.
ఎలాగంటే.. పట్టుకు సులభంగా సానుకూల శక్తిని గ్రహిస్తుంది. అలాగే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. వ్యాధిగ్రస్థుల శ్వాస, ఓజోన్ పొర నుంచి వచ్చే అపరిశుభ్రమైన పవనాలను పట్టు నియంత్రిస్తుంది. ఆ శక్తులు శరీరానికి తాకనివ్వదు. వివాహానికి దాదాపు వేలాది మంది హాజరవుతారు. వారి నుంచి వచ్చే ప్రతికూల శ్వాసలు వధూవరులను తాకనీయకుండా పట్టు వస్త్రాలు చేస్తాయి. అంటువ్యాధులు సోకకూడదనే కారణం చేత వధూవరులు పట్టు వస్త్రాలు ధరిస్తారు. ఇంకా పట్టు వస్త్రాలు ధరించడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది.
వివాహానికి పట్టువస్త్రాలను ధరించడంపై పలు దేశాలు పరిశోధన చేశాయి. ఈ పరిశోధనలో పట్టువస్త్రాలను ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని తేలింది. అందుకే శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలు, ఆలయాలకు వెళ్లే సమయంలో పట్టువస్త్రాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది.
పట్టువస్త్రాలను ధరించడం ద్వారా జరిగే మేలును తెలుసుకోకుండా నాగరికత పేరుతో చాలామంది అనేక రకాల దుస్తులను ధరిస్తున్నారు. ఇకనైనా పట్టువస్త్రాలను ధరించడంలో వున్న మహిమను తెలుసుకుంటే మంచిది.