Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాలిబన్ల ఆఫ్ఘన్ ఆక్రమణ పూర్తి.. ఒకే గదిలో ఉంటున్నా..?

తాలిబన్ల ఆఫ్ఘన్ ఆక్రమణ పూర్తి.. ఒకే గదిలో ఉంటున్నా..?
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (14:52 IST)
తాలిబన్ల ఆఫ్ఘన్ ఆక్రమణ పూర్తయ్యింది. తాజాగా తాలిబన్లు జరిపే కాలేజీల్లో ఆడపిల్లలు మగపిల్లలు ఒకరినొకరు చూసుకోడానికి వీల్లేదు. పలకరించుకోడానికి వీళ్లేదు.. ఒకే గదిలో ఉంటున్నా.. మీకు మీరే మాకు మేమే.. అనేలాంటి ఏర్పాటు ఎలా ఉందో గమనించారా? దటీజ్ తాలిబన్ మార్క్ అడ్మినిస్టేషన్.
 
ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్థాన్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఎక్కడా ఆడపిల్లలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదని తాలిబన్లు రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ మేరకు ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ఒక ప్రకటన చేశారు. కో-ఎడ్యుకేషన్ విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే విద్యాసంస్థలు తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టం చేశారు.
 
ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియామకం జరిగిన మరుసటి రోజే హక్కానీ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘన్‌లో విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని హక్కానీ అన్నారు.
 
ఇప్పటి వరకూ నడిచిన విద్యా వ్యవస్థ షరియా చట్టాలకు విరుద్ధంగా నడిచిందని విమర్శించారు. అయితే తాలిబన్ల ఈ నిర్ణయాల పట్ల టీచర్లు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే బాలికలకు విద్య మరింత దూరమవుతుందని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాదాపూర్ లో స్పా చాటున వ్య‌భిచార కేంద్రం!