Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన సింగర్ సునీత (video)

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (18:53 IST)
గత కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో సింగర్‌గా కొనసాగుతున్న సునీత సుమారుగా 3,500కు పైగా సినిమా పాటలు పాడి.. తన గాత్రంతో శ్రోతలను మెప్పించింది. అంతేకాదు 500కు పైగా సినిమాలలో 121 మంది హీరోయిన్లకు పైగా వాయిస్ డబ్బింగ్ అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఒకవైపు సింగర్‌గా, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాదు అందానికే మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న సునీత సినిమాలలో నటిస్తే చూడాలని ఆమె అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 
 
అందం, అభినయం, చూడ చక్కని మోముతో చీరకట్టుకే వన్నె తీసుకొచ్చే సునీతను సినిమాలలో హీరోయిన్‌గా చేయాలని ఇటీవల ఒక మలయాళం సినీ దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు. 
 
ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా కోసం నటీనటులను తీసుకోవాలనే ప్రయత్నంలో సింగర్ సునీతను దర్శకులు కలవడం జరిగింది. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. 
 
ఇకపోతే ఈ సినిమాలో హీరోగా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ నటించబోతున్నారు. నిజానికి సునీతకు సినిమాలలో నటించడం ఇష్టం లేదా అనే విషయానికొస్తే.. ఆమె సింగర్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఒకవైపు సింగర్‌గా, మరొకవైపు గృహిణిగా, ఇంకొక వైపు భార్యగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ బిజీగా ఉన్న సమయంలో సినిమాలలోకి వెళ్లడం మంచిది కాదనుకున్న సునీత ఈ అద్భుతమైన ఆఫర్‌ను సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments