Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండగ ఆఫర్‌ 2022 ప్రకటించిన ఎస్‌బీఐ కార్డ్

cards
, గురువారం, 29 సెప్టెంబరు 2022 (23:18 IST)
భారతదేశంలో క్రెడిట్ కార్డులు మాత్రమే జారీచేసే అతిపెద్ద సంస్థ ఎస్‌బీఐ కార్డ్ ఈ పండగ సీజన్‌ 2022 సందర్బంగా సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 31, 2022 వరకు కస్టమర్లకు అనేక అద్భుతమైన ఆఫర్లు తీసుకొని వచ్చింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మర్చంట్ల ద్వారా 1600+ ఆఫర్లు అందిస్తోంది. ఈ పండగ వేళ కస్టమర్ల షాపింగ్‌ అనుభూతిని మరింత లాభదాయకంగా మార్చాలని ఎస్‌బీఐ కార్డ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌, ఫ్యాషన్‌- లైఫ్‌స్టైల్‌, జువెలరీ, ట్రావెల్‌, ఇతర ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్రదేశాలకు ఈ ఆకర్షణీమైన ఆఫర్లు విస్తరించి ఉన్నాయి.

 
ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్‌ల కోసం 2022 పండగ ఆఫర్‌లో భాగంగా 2600 నగరాల్లో 70కి పైగా జాతీయ ఆఫర్లు, 1550 ప్రాంతీయ, హైపర్‌లోకల్ ఆఫర్స్‌ ఉన్నాయి. పండగ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు వివిధ భాగస్వామ్య బ్రాండ్స్‌తో గరిష్టంగా 22.5% వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందవచ్చు. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ సందర్భంగా అమెజాన్‌తో ఎస్‌బీఐ ప్రత్యేక భాగస్వామ్యం ఎస్‌బీఐ కార్డ్‌ కస్టమర్లకు మేము అందిస్తున్న ఒక ప్రధాన ఆఫర్‌. ఈ సంవత్సరంలో అతిపెద్ద ఆన్‌లైన్‌ సేల్‌ ఈవెంట్స్‌లో ఇది ఒకటి. ఇది అక్టోబర్‌ 3, 2022 వరకు కొనసాగుతుంది. ఇదే కాకుండా తన విలువైన కస్టమర్ల కోసం ఎస్‌బీఐ కార్డ్‌ 28 అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్స్‌ నుంచి రకరకాల ఆఫర్లు అందిస్తోంది. ఇందులో ఫ్లిప్‌కార్ట్‌, సాంసంగ్‌ మొబైల్‌, రిలయన్స్ ట్రెండ్స్‌, పాంటలూన్స్, రేమండ్స్‌, ఎల్‌జీ, సాంసంగ్‌, సోనీ, హెచ్‌పీ, మేక్‌ మై ట్రిప్‌, గోఐబిబో, విశాల్‌ మెగామార్ట్‌, రిలయన్స్ జువెల్స్, క్యారెట్‌లేన్‌, హీరో మోటర్స్‌ ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్‌ ఇందులో ఉన్నాయి.

 
ఈ సందర్భంగా ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ-సీఈఓ శ్రీ రామ్మోహన్‌ రావు అమరా మాట్లాడుతూ, “పండగ వేళల్లో ప్లాన్డ్‌, అన్‌ప్లాన్డ్‌ ఖర్చులు, భారీ ఖర్చులు కస్టమర్లకు ఉంటాయని మేము గ్రహించాం. కస్టమర్-సెంట్రిక్ బ్రాండ్‌గా మేము కస్టమర్లు చేసే కొనుగోళ్లు అది ఆన్‌లైన్‌ కావచ్చు, ఆఫ్‌లైన్‌ కావచ్చు వారి చెల్లింపు అనుభూతిని అనేక రెట్లు మెరుగుపరచడానికి మేము ఎప్పుడూ కృషి చేస్తాము. మా కస్టమర్ల ఖర్చు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధిక విలువ అందించే ప్రతిపాదనలపై మేము దృష్టి సారిస్తాం. మా పండుగ ఆఫర్స్‌ ఈ ప్రయత్నాలకు ప్రతిబింబంగా నిలుస్తాయి. వీటి ద్వారా మా కస్టమర్ల  పండగ ఆనందాన్ని పెంచగలమని మేము భావిస్తున్నాము.” 
 
పండగ షాపింగ్ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు కస్టమర్ల కొనుగోళ్లను సులభతరం చేయడానికి ఎస్‌బీఐ కార్డ్ ఈఎంఐ ఇప్పుడు భారతదేశంలోని 1.6 లక్షల+ వ్యాపారులు & 2.25 లక్షల+ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. 25+ ఎలక్ట్రానిక్స్, మొబైల్ బ్రాండ్స్‌లో  ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా కస్టమర్లు ఈఎంఐ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రాంతీయ వ్యాపారుల దగ్గర కూడా ఈఎంఐ లావాదేవీలపై 15% క్యాష్‌బ్యాక్‌ని కస్టమర్లు పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికల సాధికారిత దిశగా ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం ప్రారంభించిన ఆకాష్‌-బైజూస్‌