Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికల సాధికారిత దిశగా ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం ప్రారంభించిన ఆకాష్‌-బైజూస్‌

image
, గురువారం, 29 సెప్టెంబరు 2022 (22:55 IST)
టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌ బైజూస్‌ తమ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమం ద్వారా ఉచితంగా నీట్‌, జెఈఈ కోచింగ్‌ అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి  చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన  విద్యార్థులు, మరీముఖ్యంగా బాలికలు లబ్ధి పొందవచ్చు.
 
ఈ విద్యార్థుల ఎంపిక కోసం ANTHE శీర్షికన ఓ పరీక్షను నవంబర్‌ 5-13 తేదీలలో దేశ వ్యాప్తంగా 285 కేంద్రాలలో ఆన్‌ లైన్‌లో నిర్వహిచబోతుంది. ఈ పరీక్షలలో మెరుగైన ప్రతిభను కనబరిచిన విద్యార్ధులకు ఉచితంగా శిక్షణ అందించనున్నామని ఈ రోజు నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆకాష్ బైజూస్ అసిస్టెంట్ డైరెక్టర్, అకడమిక్స్ సి శ్రీనివాస్ రెడ్డి; బ్రాంచ్ మేనేజర్ బీ సందీప్; అకడమిక్ హెడ్-మెడికల్ బీ అనిల్ వెల్లడించారు.
 
ఈ ప్రవేశ పరీక్ష గురించి ఆకాష్‌ బైజూస్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ నీట్‌, జెఈఈ పరీక్షలలో సత్తా చాటాలని కోరుకుంటున్నప్పటికీ ఆర్ధిక పరమైన అవరోధాల కారణంగా ప్రతికూలతలు ఎదురవుతున్న విద్యార్ధులకు తోడ్పడేందుకు ఈ స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ANTHE ప్రారంభమైన నాటి నుంచి 33 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించామంటూ నవంబర్‌ 6, 13 తేదీ రెండు సెషన్‌లుగా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్‌, మెడిసన్‌లలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు తమ ఆసక్తికనుగుణంగా ప్రవేశ పరీక్ష సమయం ఎంచుకుని రాయాల్సి ఉంటుంది. మల్టీపుల్‌ ఛాయిస్‌ రూపంలో 90 మార్కులకు గానూ ఈ పరీక్ష జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో ఈ బిర్యానీ గొడవేంట్రా బాబూ...!