Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిట్‌నెస్‌- ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను అందించే మొట్టమొదటి SBI క్రెడిట్‌ కార్డ్‌

ఫిట్‌నెస్‌- ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను అందించే మొట్టమొదటి SBI క్రెడిట్‌ కార్డ్‌
, బుధవారం, 15 డిశెంబరు 2021 (17:31 IST)
భారతదేశంలో మొట్టమొదటి ప్యూర్‌ ప్లే క్రెడిట్‌ కార్డ్‌ జారీదారు ఎస్‌బీఐ కార్డు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌పై దృష్టి సారించి ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ కార్డును ఆలోచనాత్మకంగా వినూత్నమైన ఫీచర్లు, ప్రయోజనాలతో తీర్చిదిద్దారు.

 
ఇది కార్డుగ్రహీతల ఆరోగ్య, వెల్‌నెస్‌ పట్ల అవసరాలను తీర్చే ప్రయోజనాలనూ అందిస్తుంది. అంతేనా, పరిశ్రమలో 4999 రూపాయల విలువ కలిగిన నాయిస్‌ కలర్‌ ఫిట్‌ పల్స్‌ స్మార్ట్‌వాచ్‌ను జాయినింగ్‌ ఫీజు చెల్లించిన వెంటనే వెల్‌కమ్‌ గిఫ్ట్‌గా అందిస్తున్న ఒకే ఒక్క సంస్థగా ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ నిలిచింది.

 
ఈ ఆవిష్కరణ గురించి రామ మోహన్‌ రావు అమర, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ-ఎస్‌బీఐ కార్డ్‌ మాట్లాడుతూ, ‘‘ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం పట్ల ప్రజలలో అప్రమత్తత పెరిగింది. కోవిడ్ 19తో దీని ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు.

 
ఎస్‌బీఐ కార్డు వద్ద, మేము గమనించింది ఏమిటంటే, వినియోగదారులు ఆరోగ్యం, వెల్‌నెస్‌ కోసం అమితంగా ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు నగరీకరణ, భారీగా పెరుగుతున్న జనాభా, కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఈ ఖర్చు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ పరిచయం చేసేందుకు ఇది మంచి సమయమని మేము భావించాము. ఇది వినియోగదారుల ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌ అవసరాలను గణనీయంగా తీర్చనుంది’’ అని అన్నారు.

 
వెల్‌కమ్‌ బహుమతిగా నాయిస్‌కలర్‌ ఫిట్‌ పల్స్‌ స్మార్ట్‌వాచ్‌ను ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ అందిస్తుంది. అంతేకాదు ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్‌ వినియోగదారులు 4వేలకు పైగా జిమ్స్‌, ఫిట్‌నెస్‌ స్టూడియోలతో పాటుగా అపరిమిత ఫిట్‌నెస్‌ సెషన్స్‌ను సైతం పొందవచ్చు. ఇది ఒక సంవత్సరం పాటు నెట్‌మెడ్స్‌ ఫస్ట్‌ సభ్యత్వం అందించంతో పాటుగా పాథాలజీ ల్యాబ్‌ పరీక్షలలో 5% రాయితీ సైతం అందిస్తుంది.

 
ఈ కార్డు వార్షిక సభ్యత్వ రుసుము 1499 రూపాయలు. ఇది వీసా సిగ్నేచర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆవిష్కరించబడింది. కార్డు సభ్యత్వ కాలంలో 2 లక్షల రూపాయల ఖర్చు మైలురాయిని అధిగమిస్తే రెన్యువల్‌ ఫీజు ఉపసంహరిస్తారు. ఫార్మసీలు, కెమిస్ట్‌ షాప్స్‌, డైనింగ్‌, మూవీస్‌ వద్ద ఖర్చు చేస్తే ఐదు రెట్ల పాయింట్లను  పొందవచ్చు. అంతేకాదు, ఓ సంవత్సరంలో 4 లక్షల రూపాయలు ఖర్చుచేస్తే 1500 రూపాయల నెట్‌మెడ్స్‌ ఓచర్‌ సైతం పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజాకు అసమ్మతి సెగ.. వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవా?