Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

ఠాగూర్
బుధవారం, 16 జులై 2025 (12:42 IST)
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. నెలలు నిండక ముందే ఆమె ప్రసవించింది. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో కియారా ప్రసవించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ జంట ప్రకటించిన విషయం తెలిసిందే.
 
2021లో విడుదలైన 'షేర్షా'లో సిద్ధార్థ్, కియారా నటించారు. ఆ సినిమా షూటింగులోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 8లో భాగంగా తన లవ్ స్టోరీని కియారా పంచుకుంది. ఇటలీలోని రోమ్‌లో సిద్ధార్థ్ తనకు లవ్ ప్రపోజ్ చేసినట్లు చెప్పింది. దీంతో 2023 ఫిబ్రవరి 7వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్‌లో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత కూడా వీరిద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కియారా నటించిన 'వార్ 2' ఈ ఆగష్టు 14న విడుదల కానుంది. 
 
ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా రూపుదిద్దుకుంటున్న 'పరమ్ సుందరి' ఈనెల 25వ తేదీన విడుదలకానుంది. అరునాధ్ కుమార్ దర్శకత్వంలో 'వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్'లోనూ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments