Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రో వివాదంలో శింబు

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:55 IST)
Simbhu
తమిళ కథానాయకుడు శింబు తెలుగులో న‌వ‌మ‌న్మ‌థుడు సినిమాగా డ‌బ్బింగ్‌తో అంద‌రికీ తెలిసిందే. అందులో న‌య‌న‌తార‌తో రొమాన్స్ స‌న్నివేశాల్లో జీవించేశాడు. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేశాడు. అయితే చాలామంది హీరోల‌కంటే కాస్త వెనుక‌డు వేశాడ‌నే విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఓ సినిమా విష‌యంలో అసోసియేష‌న్‌ల మ‌ధ్య ఫిర్యాదులు వెల్లాయి. 
 
శింబు నటిస్తున్న ‘వెందు తనిందదు కాడు’ సినిమా వ‌ల్ల ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెఫ్సీ), తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (టి.ఎఫ్.సి.సి.) మధ్య చ‌ర్చ‌లు తీవ్రంగా సాగుతున్నాయి. శింబు గతంలో నలుగురు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని అతిక్ర‌మించి ఈ కొత్త సినిమాకు డేట్స్ కేటాయించాడు. ఇది తెలిసిన నిర్మాత‌లు త‌మమండ‌లికి లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. ప్ర‌ధానంగా శింబుతో‘ట్రిపుల్ ఎ’ మూవీ నిర్మించిన మైఖేల్ రాయప్పన్ తనకు ఆ సినిమా ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చకుండా శింబు కొత్త సినిమాలో నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. 
 
ఇక ఈ విష‌యాన్ని ప‌రిశృలించిన నిర్మాతల మండలి శింబు సినిమాల‌కు సహకరించవద్దంటూ పెఫ్సీకి లేఖ రాసింది. అయితే క‌రోనా సమయంలో పెఫ్సీ సభ్యులకు శింబుతో ప్ర‌స్తుతం చేస్తున్న‌ చిత్ర నిర్మాత ఇషారీ కె గణేశ్ ఎంతో సాయం చేశాడు.ప్రస్తుతం రోజా భర్త సెల్వమణి పెఫ్సీకి అధ్యక్షుడిగా ఉన్నారు. శింబు తన నిర్మాతల కష్టాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఫైన‌ల్‌గా శింబు ఏం చెబుతాడో రేపు తెలుస్తుంద‌ని సెల్వ‌మ‌ణి అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments